సాధనపత్రం 1 (పేజీ నం. 2)
అ) పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) భారతీయ జెండాలో అశోకచక్రం దేనిని సూచిస్తుంది?
జవాబు: అశోకచక్రం న్యాయం, ధర్మం, నిరంతర పురోగతిని సూచిస్తుంది.
2) దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని దేనిని భావిస్తారు?
జవాబు: జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారానికి గుర్తు.
3) జాతీయ జెండా గురించి చదివారు కదా! మీ బడిలో జాతీయ జెండా ఎప్పుడు ఎగురవేస్తారు?
జవాబు: ఆగష్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) నాడు ఎగురవేస్తారు.
4) మన జాతీయ జెండా ఏ రంగులను కలిగి ఉంటుంది?
జవాబు: ఈ ) కాషాయం, తెలుపు, ఆకుపచ్చ
ఆ) కింది గేయ చరణాలను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) పొగడరా నీ తల్లి భూమి భారతిని! ఈ చరణంలో “తల్లి” అంటే ఎవరు?
జవాబు: భరతదేశం (భారతమాత).
2) మనదేశం భారతదేశం కదా! మీకు తెలిసిన ఇతర దేశాల పేర్లు రాయండి.
జవాబు: శ్రీలంక, చైనా, నేపాల్, అమెరికా, రష్యా, జపాన్.
3) 'పౌరులు' అని ఎవరిని అన్నారు?
జవాబు: భారతదేశంలో నివసించే ప్రజలను (భారతీయులను) పౌరులు అన్నారు.
సాధనపత్రం 2 (పేజీ నం. 3)
అ) ఈ కింది గేయ చరణాలను సరైన క్రమంలో రాయండి.
జనియించినాడవీ స్వర్గఖండమున!
ఏ మంచి పూవులన్ బ్రేమించినావో!
నినుమోచె నీతల్లి, కనక గర్భమున!
ఆ) కింది గేయ చరణాలలోని ఖాళీలను పూరించండి
1) దీపించె నీపుణ్య దేశంబు పుత్ర!
2) సూర్యుని వెలుతురు సోకునందాక
3) నరుడు ప్రాణాలతో నడుచునందాక
4) ఓడల వెంబడి జెండాలు ఆడునందాక
ఇ) కింది పేరాను చదవండి. పట్టికను పూరించండి.
| దేశభక్తి లక్షణాలు | పాठశాలలో పాటించాల్సిన నియమాలు |
|---|---|
|
* మనం దేశాన్ని ప్రేమించాలి. * దేశాభివృద్ధి కోసం పని చేయాలి. * జాతీయ జెండా, జాతీయ గీతానికి గౌరవం ఇవ్వాలి. * దేశం యొక్క మంచి కోరడం. |
* పాఠశాలలో శుభ్రత పాటించడం. * బడి నియమాలు, క్రమశిక్షణ పాటించడం. * ఉపాధ్యాయుల మాట వినడం. |
1. మీ బడిలో శుభ్రత కోసం పరిశుభ్రత కార్యక్రమం జరుగుతోంది. దీనిలో పాల్గొనడం ద్వారా మీరు ఏ విలువను కలిగి ఉన్నారు?
జవాబు: అ) దేశభక్తి
సాధనపత్రం 3 (పేజీ నం. 4) AP 5th Telugu 1st Unit Work Book Answers 2026-27
1) పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
మ, ఎ, య, ఉ, బ
పై అక్షరాలతో మొదలయ్యే పదాలు: ఎడమ, ఈగ, ఉడత, బలపం, పలక
సొంత వాక్యం: పలక మీద రాయడానికి బలపం కావాలి.
2) పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
ము, మా, పా, రో
పై అక్షరాలతో మొదలయ్యే పదాలు: ముసురు, మామిడి, పాలు, రోడ్డు, చాప
సొంత వాక్యం: నేను మామిడి పండు తింటాను.
3) పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి. గడులలో రాయండి.
న్నా, ప్పి, మ్మ, ల్లు
పై అక్షరాలు ఉండేలా పదాలు: ఉన్నాను, అమ్మ, లడ్డు, తమ్ముడు
సొంత వాక్యం: అమ్మ, నాన్నలు మనకు దైవంతో సమానం.
4) పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో వాక్యాలను రాయండి.
పదం 1: క్రమశిక్షణ - విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యం.
పదం 2: ఉపాధ్యాయులు - మనం ఉపాధ్యాయులను గౌరవించాలి.
సాధనపత్రం 4 (పేజీ నం. 5)
అ) కీలక పదం ఆధారంగా పదాలు రాయండి (కీలక పదం: బడి).
తరగతి గది పెన్సిల్ గదులు ఉపాధ్యాయులు విద్యార్థులు భవనం మధ్యాహ్న భోజనం గణితం తెలుగు
ఆ) పై పదాలతో వాక్యాలు రాయండి.
ఉదాహరణ: మా బడిలో ఐదు తరగతి గదులు ఉన్నాయి.
1. మా బడిలో ఐదుగురు ఉపాధ్యాయులు వస్తారు.
2. మా బడిలో విద్యార్థులు అందరూ బాగా చదువుతారు.
3. మా బడిలో మధ్యాహ్న భోజనం బాగా వండి వడ్డిస్తారు.
4. నా స్కూలు బ్యాగ్‌లో పెన్సిల్ ఉంది.
5. నాకు గణితం అంటే చాలా ఇష్టం.
6. నాకు తెలుగు పద్యాలు యాభై వచ్చు.
ఇ) గీత గీసిన పదానికి అర్ధాన్ని గుర్తించండి.
1. విశ్వం అనంతమైనది.
జవాబు: అ) అంతులేనిది
ఈ. కింది వాక్యాన్ని చదవండి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. దానితో సొంత వాక్యాన్ని రాయండి.
కనకం ధరలు బాగా పెరిగాయి.
అర్థం: బంగారం
సొంత వాక్యం: కనకం చాలా విలువైనది.
సాధనపత్రం 5 (పేజీ నం. 6) AP 5th Telugu 1st Unit Work Book Answers 2026-27
అ) కింది పదాలకు వచనాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి.
| ఏకవచనం | బహువచనం |
|---|---|
| బడి | బడులు |
| గీతం | గీతాలు |
| ఓడ | ఓడలు |
| పౌరుడు | పౌరులు |
| దేశం | దేశాలు |
సొంత వాక్యాలు:
బడి / బడులు: బడిలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. / ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ బడులు ఉన్నాయి.
గీతం / గీతాలు: జనగణమన మన జాతీయ గీతం. / నేను దేశభక్తి గీతాలు బాగా పాడుతాను.
పౌరుడు / పౌరులు: ప్రతి పౌరుడు దేశం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. / నేటి బాలలే రేపటి పౌరులు.
దేశం / దేశాలు: మన దేశం భారతదేశం. / విమానమెక్కి చాలా దేశాలు తిరగొచ్చు.
ఆ) గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
1. పాడరా నీ తెన్గు, బాల గీతములు! -> తెలుగు
2. మధుకు మహా యోగం కలిగింది. -> అదృష్టం
ఇ) సరైన జవాబును గుర్తించండి.
1. देशाభక్తి ఉన్న పిల్లలు పాఠశాలలో కూడా బాధ్యతగా ప్రవర్తిస్తారు.
జవాబు: ఆ) బాధ్యతగా
సాధనపత్రం 6 (పేజీ నం. 7)
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు?
జవాబు: రాయప్రోలు సుబ్బారావు గారు మన పౌరులని ధీరులని, మనకు ఎవరూ సాటి లేరని చెప్పారు.
2. భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి అన్నారు?
జవాబు: భారతీయ నౌకలపై మన జాతీయ జెండాలు ఆడుతున్నాయని కవి అన్నారు.
3. ఏ దేశం వెళ్లినా మనం ఏమి చేయాలి?
జవాబు: మనం ఏ దేశము వెళ్ళినా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని పొగడాలి, మన జాతి గౌరవాన్ని నిలపాలి.
4. "ఏ మంచి పూవులన్ ప్రేమించినావో” అని కవి అన్నాడు కదా! నీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి.
జవాబు: నెహ్రూ, నేతాజీ, అంబేద్కర్, తిలక్, గాంధీజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్.
5. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి.
జవాబు: ఏ విదేశములకు వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క గొప్పతనాన్ని పొగడాలి. మన జాతి గర్వాన్ని నిలపాలి. మన వంటి భూమి గాని, మన వంటి ధీరులు గాని ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. ఈ భరత భూమిపై పుట్టాము అంటే అది పూర్వపుణ్యం.
6. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి?
జవాబు: పౌరులు తమ జాతి కోసం, దేశం కోసం పాటుపడాలి, దేశభక్తి కలిగి ఉండాలి. చట్టాలను గౌరవించాలి, ఇతరుల హక్కులకు విలువ ఇవ్వాలి. జాతీయ చిహ్నాలను గౌరవించాలి.
సాధనపత్రం 7 (పేజీ నం. 8)
అ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. వాక్యం పూర్తి అయిన తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏది?
జవాబు: పూర్ణ విరామచిహ్నం (.)
2. శివయ్య తప్పుగా రాసిన వాక్యాలను సరిచేసి రాయండి:
* మేము పెన్ను, పెన్సిల్, రబ్బరు కొన్నాము.
* నేను రోజూ బడికి వెళ్తాను.
* మా అమ్మ కూరగాయలు, ఆకుకూరలు కొన్నది.
* నాకు ఆటలు, పాటలు, కథలు అంటే ఇష్టం.
* నేను పద్యాల పోటీలో బహుమతి పొందాను.
ఆ) క్రింది పేరాను తిరిగి రాయండి (విరామ చిహ్నాలతో):
మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అందరం జాతీయగీతం ఆలపిస్తాము. ఆ తర్వాత విద్యార్థులు దేశభక్తితో కూడిన ప్రసంగాలు, పాటలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.
సాధనపత్రం 8 (పేజీ నం. 9)
గేయాన్ని పొడిగించండి:
మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం.
జామపండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం.
నారింజ పండు మాకిష్టం, నారింజ మొక్కను నాటేస్తాం.
పనస పండు మాకిష్టం, పనస మొక్కను నాటేస్తాం.
అరటి పండు మాకిష్టం, అరటి మొక్కను నాటేస్తాం.
సాధనపత్రం 9 - నేనేమి నేర్చుకున్నాను? (పేజీ నం. 10)
అ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1) వాక్యంలో గీతగీసిన పదానికి వచనం మార్చి రాయండి:
నవరాత్రి ఉత్సవాలకు పందిళ్ళు వేస్తారు. -> నవరాత్రి ఉత్సవాలకు పందిరి వేస్తారు.
2) సొంత వాక్యం రాయండి (కథ):
జవాబు: నేను మీకు ఒక మంచి కథ చెప్పనా?
3) సరైన విరామ చిహ్నాలను పాటించని వాక్యాన్ని గుర్తించండి.
జవాబు: అ) రాజు, బడికి వెళ్లాడు.
ఆ) కింది పేరాను చదివండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. పేరాలో "నిజమైన వీరులు" అని ఎవరిని అన్నారు?
జవాబు: పారిశుధ్య కార్మికులను అన్నారు.
2. మీ బడిలో పరిశుభ్రత కోసం మీరు చేయగల పనులు ఏమిటి?
జవాబు: చెత్త ముక్కలను చెత్తబుట్టలో మాత్రమే వేయాలి.
3. చెత్తను ఎక్కడ వేయాలి?
జవాబు: ఇ) చెత్త బుట్టలో
ఇ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. మధ్యాహ్నభోజనం సమయంలో మీరు పాటించే రెండు పరిశుభ్రత నియమాలను రాయండి.
జవాబు: భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటాను. భోజనం తరువాత కూడా చేతులను శుభ్రం చేసుకుంటాను.
సాధనపత్రం 10 - నేనేమి నేర్చుకున్నాను? (పేజీ నం. 11)
ఇ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. వాక్యంలో గీతగీసిన పదానికి బహువచనం రాయండి (నెమలి).
జవాబు: నెమళ్ళు
2. దేశభక్తికి సంబంధించిన రెండు నినాదాలు రాయండి.
జవాబు: 1. జై జవాన్ - జై కిసాన్. 2. వందేమాతరం - భారత్ మాతా కీ జై.
3. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి?
జవాబు: పౌరులు దేశం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి, తోటివారిని గౌరవించాలి, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి మరియు క్రమశిక్షణతో ఉంటూ సమాజానికి సహాయం చేయాలి.
4. 'లేదురా యిటువంటి భూదేవి యెందు' అని కవి అన్నారు కదా! మన దేశ గొప్పతనం గురించి రాయండి.
జవాబు: మన భారతదేశం ఎంతో పవిత్రమైనది. ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ సోదరభావంతో కలిసి జీవించే గొప్ప సాంప్రదాయం మన దేశ సొంతం.
5. 'ఏ దేశమేగినా' గేయ సారాంశాన్ని రాయండి.
జవాబు: మనం ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మరువకూడదు. మన దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. భారతీయుడిగా గర్వంగా నిలబడాలి.
ఈ) కింది ప్రశ్నకు జవాబులు రాయండి.
మన దేశ ప్రతిష్టని పెంచిన క్రీడాకారులను ప్రశంసిస్తూ నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు: క్రీడాకారులు ప్రపంచ వేదికలపై మన జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. కఠినమైన శ్రమ, పట్టుదలతో విజయాలు సాధించి దేశానికి ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నారు. మన దేశంలో ఎందరో మహానుభావులైన క్రీడాకారులు ఉన్నారు, వారు మనందరికీ అభినందనీయులు.



0 comments:
Give Your valuable suggestions and comments