AP 7th Telugu సిరిమానోత్సవం . గుణదల మేరీమాత ఉత్సవం Answers

📘 పాఠం 6: మన విశిష్ట ఉత్సవాలు — ప్రశ్నలు - జవాబులు

(1. సిరిమానోత్సవం & 2. గుణదల మేరీమాత ఉత్సవం సంబంధిత ప్రశ్నలు — పేజీ 97)

AP 7th Telugu 2nd Unit Prose : కోటప్పకొండ ప్రభల తిరునాళ్ళ,  రొట్టెలపండుగ Answers

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి — ప్రశ్న 1

1. గుణదల మేరీమాత ఉత్సవానికి మూలం ఏమిటో తెలపండి?

ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగర చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం గుణదల చర్చిలోని గుహలో కూడా ఉంది. లూర్దు నగర శివారులో బెర్నాడెట్ అనే బాలిక కొండ దిగువకు వంట చెరకు ఏరుకోడానికి వెళ్ళినప్పుడు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది. ఫిబ్రవరి 11న ఆమెకు మేరీమాత కనిపించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో మేరీమాత ఉత్సవాలు జరుపుకుంటారు. ఇదే సంప్రదాయాన్ని అనుసరించి 1924 నుండి గుణదలలో కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి — ప్రశ్న 1

1. సిరిమానోత్సవం జాతర గురించి రాయండి?

సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు. పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, ఆమె సిరిమానోత్సవం విజయనగరంలో వైభవంగా జరుగుతుంది. పూర్వం విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమవుతుండగా, యుద్ధానికి వెళ్ళవద్దని అతని చెల్లెలు మొరపెట్టుకున్నా వినకుండా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధరంగంలో అన్నను చూడడానికి వెళ్ళిన పైడితల్లి, అక్కడ అన్న మరణించినట్లు తెలుసుకుని దుఃఖంతో పెద్ద చెరువులో దూకి ఆత్మార్పణం చేసుకుంది. కొంతకాలానికి ఆమె ఒక భక్తునికి కలలో కనిపించి, తాను చెరువులో విగ్రహరూపంలో ఉన్నట్లు తెలియజేసింది. దానితో ఆలయం కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దసరా తరువాత వచ్చే మొదటి మంగళవారం నాడు అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. ఉత్సవానికి ముందు పైడితల్లి అమ్మవారికి సిరిమానును ఎక్కడినుండి తేవాలో పూజారి ఆలయ ధర్మకర్తలకు తెలియజేస్తాడు. సుమారు 60 అడుగుల పొడవుండే సిరిమానును అలంకరించి, గుడిపూజారిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి ఆ ఆసనంపై కూర్చోబెడతారు. ఆ సిరిమానుకు ముందుభాగంలో బెస్తవారి పడవ, అంజలిరథం నడుస్తాయి. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు.

✅ ఈ జవాబులు 7వ తరగతి తెలుగు సారథి పాఠ్యపుస్తకంలోని పేజీ 97లో ఇవ్వబడిన ప్రశ్నలకు, పాఠ్యాంశంలోని సమాచారం ఆధారంగా రూపొందించబడ్డాయి.